Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బడా వ్యాపారిని తన అందంతో లోబరచుకుని కోట్లు దండుకున్న బార్ డ్యాన్సర్!

  • బెంగళూరు బార్ లో డ్యాన్సర్ పై మనసుపడ్డ వ్యాపారి
  • రహస్య కెమెరాలతో రికార్డు చేసి బ్లాక్ మెయిల్ చేసిన డ్యాన్సర్
  • పోలీసులను ఆశ్రయిస్తే పరువు పోతుందని భయపడుతున్న వ్యాపారి
శానిటరీ వేర్ వ్యాపారంలో పేరు తెచ్చుకున్న ఓ బడా వ్యాపారిని తన అందాన్ని ఎరవేసి లోబరచుకుని కోట్లు దండుకుందో బార్ డ్యాన్సర్. ఇప్పుడామె మోసాన్ని పోలీసులకు ఫిర్యాదు చేస్తే తన కుటుంబం పరువు పోతుందన్న భయంతో మహిళా సంఘాన్ని ఆశ్రయించాడు. మరిన్ని వివరాల్లోకి వెళితే, బెంగళూరులో వ్యాపారవేత్తగా ఉన్న ఓ వ్యక్తి, 2016లో ఓ బార్ కు వెళ్లాడు.

అక్కడ డ్యాన్స్ చేస్తున్న డ్యాన్సర్ (24)పై మనసు పడ్డాడు. తరచూ అదే బార్ కు వెళ్లడం, ఆమెకు బహుమతులు తీసుకెళ్లడం, డబ్బులివ్వడం చేశాడు. ఆ వ్యాపారంటే తనకూ ఇష్టమేనన్నట్టు నటన మొదలు పెట్టిన బార్ డ్యాన్సర్, తన ప్రియుడితో కలసి మాస్టర్ ప్లాన్ వేసింది. రహస్యంగా కెమెరాలు అమర్చి, వ్యాపారితో తాను గడుపుతున్న వీడియోలు తీయించింది. ఆపై వాటిని చూపించి డబ్బు డిమాండ్ చేసినప్పుడు మాత్రమే తాను మోసపోయానని తెలుసుకున్నాడా వ్యాపారి.

ఆ వీడియోలను ఇంటికి పంపుతామని, నెట్ లో పెడతామని బెదిరిస్తూ, రూ. 2.50 కోట్లను వ్యాపారి నుంచి లాగింది. ఇక ఆమె ప్రియుడు కూడా వాటిని చూపిస్తూ, ఒకేసారి రూ. 50 లక్షలు ఇచ్చి సెటిల్ మెంట్ చేసుకుందామని ఆఫర్ ఇస్తున్నాడట. అంత ఇచ్చుకోలేక, పోలీసులను ఆశ్రయించలేక బాధితుడు మహిళా సంఘాన్ని ఆశ్రయిస్తే, వారు పోలీసులకు రిపోర్ట్ ఇస్తేనే మేలని సూచించారట.
Bengalore
Bar Dancer
Blackmail
Business Man

More Telugu News